కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం నుండి గైగొల్లపల్లి వరకు రూ.2.51 కోట్ల వ్యయంతో నిర్మించబోయే రహదారి అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి IAS, ఆర్‌డిఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ రహదారి ద్వారా గ్రామాల మధ్య రవాణా మరింత మెరుగుపడుతుందని, ప్రజలకు మౌలిక వసతుల అభివృద్ధి దిశగా ఇది కీలకంగా నిలుస్తుందన్నారు మంత్రి.కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదని, నిర్వాహకులు ప్రామాణికంగా పనులు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.