స్పెషల్ ఫోకస్

యర్రగొండపాలెం ఎంపీడీవో కు షోకాజ్ నోటీసు…

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించం – ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా…తెలంగాణ న్యూస్విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోనని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు,సోమవారం జాయింట్ కలెక్టరు ఆర్. గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు,వివిధ కేటగిరీలలో సచివాలయాల ద్వారా అందించాల్సిన సేవలు పేలవంగా ఉండడం, ఎంపీడీవో ల పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు,ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కి షోకాజు నోటీసులు జారి చేయాలనీ జడ్పీ సీఈఓ కు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో హౌసింగ్ పీడీ పి. శ్రీనివాస ప్రసాద్, డీపీవో వెంకట నాయుడు, డ్వామా మా పీడీ జోసఫ్ కుమార్, జడ్పీ సీఈఓ చిరంజీవి, సీపీవో వెంకటేశ్వర్లు, పరిశ్రమల జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Back to top button