తెలంగాణ న్యూస్ ఖమ్మం
ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియాను అరికట్టాలని, నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డ్రగ్ అధికారికి ప్రగశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి పి వై ఎల్ జిల్లా కార్యదర్శి ఎన్వి రాకేష్ మాట్లాడుతూ.
ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందకపోవడంతో తప్పని పరిస్థితులలో పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలోనూ ఆశ్రయిస్తున్నారు, దీన్ని ఆసరా చేసుకుని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఫీజులను వసూలు చేసి పేదలను దోసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ తో సంబంధం పెట్టుకున్న మెడికల్ షాపులలో అధికంగా వసూల్ చేసి బిల్లును కూడా ఇవ్వకుండా దోసుకుంటున్న ఫలితంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు మరింత పేదలుగా మారుతున్నారు. పేదల ఆదాయంలో ఎక్కువ మొత్తం వైద్యానికే చెల్లిస్తూ నష్టపోతున్నారు. కావున ప్రభుత్వ హాస్పిటల్స్ లో సమస్యలను పరిష్కరించి హాస్పిటల్స్ బలోపేతం చేయాలి-ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడిని అరికట్టాలని.
ప్రైవేట్ మెడికల్ షాప్ లపై అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల జోరుగా డ్రగ్స్ దందా కొనసాగుతోందన్నారు. కొన్ని మెడికల్ షాపులలో ఫార్మాసిస్ట్ ఉండడం లేదని, అనుభవం లేని టెన్త్ ఇంటర్మీడియట్ చదివేనా వారితో మందులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మందులను విక్రయిస్తున్నారన్నారు. నిబంధనలు పాటించకుండా, ఎక్కువ ధరకు మందులను విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఆవుల మంగతాయి జిల్లా ఉపాధ్యక్షురాలు టీ ఝాన్సీ పివైఎల్ నగర కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.