మిర్చి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
తెలంగాణ న్యూస్,కూసుమంచి:
అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని లింగారంతండా గ్రామ శివారు ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి పక్కన మిర్చి తోటలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న కూసుమంచి ఎస్ఐ నాగరాజు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన వస్తుందని కొద్ది రోజుల క్రితం హత్య చేసి పడేశారా..? అనే కోణంలో స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.