తాజా వార్తలు

మిథున్ రెడ్డికి భారీ షాక్… లుకౌట్ నోటీసులు జారీ

తెలంగాణన్యూస్:

Mithun Reddy Faces Setback Lookout Notice Issued
  • లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి
  • ముందస్తు బెయిల్ పిటిషన్ ను నిన్న కొట్టేసిన హైకోర్టు
  • దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు నిన్న తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా… ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Show More

Related Articles

Back to top button