స్పెషల్ ఫోకస్

మాల మాదిగ ఉద్యమాన్ని నాగా-కుకి కొట్లాటగా మార్చే కుట్ర చేస్తున్న వివేక్ మందకృష్ణ

తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా గడ్డం వివేక్ మందకృష్ణ మాదిగ ప్రయత్నిస్తున్నారని ఈ ఉద్యమాన్ని మరో నాగ కుకీ కొట్లాటగా మారనుందని మరి మసీ కార్పొరేషన్ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థి యువగర్జన గోడ పత్రిక విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ వర్గీకరణ చేయడం మందకృష్ణ మాదిగకు ఇష్టం లేదని అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. గడ్డం వివేక్ మందకృష్ణ మాదిగ స్వార్థ ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో నాగ కుకి గొడవ వలె మరో వర్గ భేదాలు వచ్చి రాష్ట్రం అగ్నిగుండంగా మారే అవకాశం ఉందని అన్నారు. గడ్డం వివేక్ మందకృష్ణ మాదిగ రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల తెలంగాణ రాష్ట్రంలోని మాల మాదిగలు శాంతియుతంగా ఉంటారని ఎలాంటి విభేదాలకు వెళ్లకుండా ఉన్నారని అన్నారు. వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా మాదిగలను అణచివేసిన బిజెపి ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కృష్ణ మాదిగ వెంటనే తిరస్కరించాలని అన్నారు. లక్ష డప్పులు కార్యక్రమం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని పబ్లిక్కు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ కార్యక్రమం పెట్టడం వల్ల జరగరానిది జరిగితే దానికి నైతిక బాధ్యత కృష్ణ మాదిగ వహించాలని అన్నారు. వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుద్దని గడ్డం వివేక్, ఇప్పుడు జరుగుద్దని కృష్ణ మాదిగ ఉన్నారని అన్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందని ఉన్నారు. ఫిబ్రవరి రెండున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో మాదిగ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి యువగర్జన బహిరంగ సభకు వేలాదిగా మాదిగలు చారలు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లేశం, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు తిరుపతి, తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మెర స్టాలిన్, డాక్టర్ నండ్రు నరసింహ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మారపాక సాయిలు, తెలంగాణ స్టూడెంట్ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రింగు రాంబాబు, మాదిగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుల జోగు గణేష్,శివ, దేవరకొండ నరేష్, కొమ్ము ప్రవీణ్, మీసాల మహేష్, ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కాదాసీ రాహుల్

Show More

Related Articles

Back to top button