-మహిళా సాధికారత పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.పెద్దపల్లి బ్యూరో,ఫిబ్రవరి2తెలంగాణ న్యూస్:కుటుంబం,దేశాభివృద్ధి కొరకు మహిళా సాధికారత ఎంతో అవసరమని,మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మహిళా సాధికారత పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మహిళలకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహిస్తుందని అన్నారు.కుటుంబం అభివృద్ధి మహిళల చేతిలోనే ఉంటుందని అన్నారు.మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ తెలిపారు.మహిళల చేతిలో సంపద ఉంటేనే పొదుపు అధికంగా ఉంటుందని,ఆర్థిక ప్రగతికి పొదుపు చాలా కీలకమని,ప్రతి ఒక్కరు పొదుపు అలవర్చుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ ,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
0 Less than a minute