స్పెషల్ ఫోకస్

మరో భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించిన డైరెక్టర్ శంకర్

Director Shankar Announces Massive Budget Film Velpari
  • తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన శంకర్
  • ‘వేల్పారి’ తన తదుపరి ప్రాజెక్ట్ అని వెల్లడి
  • భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, టెక్నాలజీ అవసరమవుతాయన్న శంకర్
దక్షిణాది గొప్ప సినీ దర్శకులలో ఒకరిగా పేరుగాంచిన డైరెక్టర్ శంకర్ ఇటీవల కొంత వెనుకబడ్డారు. తాజాగా ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలు ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఈ సినిమాల ఫెయిల్యూర్స్ కారణంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించారు.
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ… ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రోబో’ అని చెప్పారు. ఇప్పడు ‘వేల్పారి’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుందని… ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇది ఒకటి అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, టెక్నాలజీ, ఆర్ట్ డిజైన్స్ అవసరమవుతాయని తెలిపారు. ‘అవతార్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను పరిచయం చేయనున్నారు. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుందని… తన కల త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Show More

Related Articles

Back to top button