అమ్ముడు పోయారా?జిల్లాలో చేతులు మారుతున్న వందల కోట్లు సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ సేన మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం సేవా ఘడ్ యందు ఉన్న సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మండల అధ్యక్షులు బానోతు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు వారు ఈ సమావేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేటుకు అనుమతి ఇచ్చారా? లేకపోతే సిండికేట్ వ్యాపారులకు అమ్ముడు పోయారా? అని ప్రశ్నించారు నియోజకవర్గం లో ఏదెచ్చగా సిండికేట్ మద్యం దందా నడుస్తున్నప్పటికీ మామూళ్లకు అలవాటు పడిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని సిండికేట్ దందా నడిపిస్తున్నారని ఆరోపించారు ఇలా జిల్లాలో ఉన్న ప్రజల సొమ్ము సిండికేట్ వ్యాపారుల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు1/70 యాక్టు, పీసా చట్టాలు ఆములలో ఉన్న ఈ చట్టాలకు విరుద్ధంగా ప్రతి గ్రామపంచాయతీలలో ప్రతి మారుమూల ప్రాంతాలలో బెల్ట్ షాపులు అడ్డు అదుపు లేకుండా పుట్టగొడుగుల్లా వెలిశాయని నిరక్షరాసులైన గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఎమ్మార్పీ ధరల కంటే అధిక రేట్లకు మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ప్రధానంగా యువకులు అధికంగా మద్యానికి బానిసలై గ్రామాలలో కుటుంబాలలో ఘర్షణలకు పాల్పడుతున్నారు. సిండికేట్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని గతంలో సేవాలాల్ సేన జిల్లా కమిటీ తరఫున ఇల్లందు ఎక్సైజ్ శాఖ సిఐ గారికి వినతి పత్రం ద్వారా తెలపడం జరిగింది మరియు ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయాన్ని సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ముట్టడి చేసినప్పటికీ అధికారులు మాత్రం సిండికేట్ వ్యవస్థపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు ఇది దేనికి నిదర్శనం అనేది ఎక్సైజ్ శాఖ తెలపాలని అన్నారు మద్యం సిండికేట్ దందాపై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి సిండికేట్ దందా నడుపుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు నాయక్ జిల్లా కార్యదర్శి భదవత్ సురేష్ నాయక్ జిల్లా ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్ మండల కార్యదర్శి లక్పతి నాయక్ ఉపాధ్యక్షులు లక్ష్మీపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు
3 1 minute read