తెలంగాణ

మంథనిలో ప్రముఖ బంగారం షాప్ యాజమానుల పరార్.

!-మొన్న గోదావరిఖని నేడు మంథని.-మార్చి 6న కూతురు పెళ్లి కోసం 7తులాల బంగారం ఇచ్చిన ఓ తండ్రి.-లబోదిబోమంటున్న బాధిత కుటుంబాలు.-న్యాయం చేయాలంటూ భాధితుల డిమాండ్.మంథని,పెద్దపల్లి బ్యూరో(:తెలంగాణ న్యూస్మొన్న గోదావరిఖనిలో ప్రముఖ బంగారం షాపు యాజమని రూ.10 కోట్లతో ఉడాయించాగా,నేడు మంథనిలో ప్రముఖ బంగారం షాప్ యజమానులు పరారయ్యారు.ఈ వార్త మంథని పట్టణంలో సంచలనం రేపుతుంది.ఇతర రాష్ట్రానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మంథనిలో గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడ్డారు.తండ్రితో పాటు కుమారులు రెండు బంగారం షాపులు ఏర్పాటు చేసి ప్రజలను నమ్మించి,కోట్లు అప్పులు చేసి ఉడాయించినట్లు తెలుస్తుంది.మంథని పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడు తన కూతురు పెళ్లి కోసం ఏడు తులాల బంగారం ఇవ్వగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.దీంతో అన్నదమ్ములకు ఫోన్ చేయగా కుటుంబ సభ్యులు అందరూ ఫోను స్విచ్ ఆఫ్ చేయడంతో వారు పరారైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.నాలుగు రోజులుగా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో షాపూ తెరవకపోవడంతో ఎవరికీ కనిపించకుండా పోవడంతో భాదితులు లబోదిబోమంటున్నారు.ఈ విషయం మంథని పట్టణమంతా వ్యాపించడంతో అతనికి ఎవరెవరు అప్పులు ఇచ్చారు.ఎవరు బంగారం ఇచ్చారు అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.ఈ విషయంపై మంథని ఎస్ఐ రమేష్ ను (మన ప్రజావాణి) వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

Show More

Related Articles

Back to top button