ఆంధ్రప్రదేశ్

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

తెలంగాణన్యూస్:

JC Prabhakar Reddy Fires on Byreddy Siddhartha Reddy
  • పెద్దారెడ్డి పాదయాత్రలో జేసీపై సిద్ధార్థ రెడ్డి విమర్శలు
  • నీలాంటి బచ్చా లీడర్లు చాలా మంది వచ్చిపోయారన్న జేసీ
  • రాత్రిపూట కన్ను ఎగరేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందని వార్నింగ్
వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర సందర్భంగా పెద్ద పప్పూరులో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి సిద్ధార్థ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జేసీ స్పందస్తూ… నీలాంటి బచ్చా లీడర్లు ఎంతో మంది వచ్చి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

రప్పా రప్పా కాదు… రాత్రిపూట కన్ను ఎగరేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందని జేసీ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు మాట్లాడే భాష మేం కూడా మాట్లాడగలం, నీకంటే ఎక్కువ బూతులు మాట్లాడగలమని చెప్పారు. కానీ, ఆ భాష తాము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పొగరు తగ్గించుకుని మంచిగా ఉండాలని హితవు పలికారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, దాన్ని కాపాడుకో అని సూచించారు.

Show More

Related Articles

Back to top button