యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి / 07 / మన తెలంగాణ న్యూస్ జిల్లా ప్రతినిధియాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంగా ఉన్న
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , బీబీనగర్ ఎయిమ్స్ ను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం రోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ప్రతి రోజు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు..? వాళ్లకు ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందని అవసరమైన పేషెంట్ లకు ఆపరేషన్లు చేస్తున్నారా..? లేదా..? అని ఆరా తీసారు. క్యూ లైన్ లో నిల్చున్న ప్రతి పేషెంట్ ను పలకరిస్తూ , డాక్టర్ లు సమయానికి వస్తున్నారా..? , అన్ని ఎక్యుప్మెంట్స్ ఉన్నాయా..? సౌకర్యాలు ఎలా ఉన్నాయి..? అని అడిగి తెలుసు కున్నారు. ఎయిమ్స్ లో సిబ్బంది నియామకం జరుగుతుందా , జరిగితే ఎ ప్రాతిపాదికన జరుగుతుంది , దీనిని ఎ ఏజెన్సీ నిర్వహిస్తున్నది , దినిలో లోకల్ వాళ్ళకి ఎంత వరకు ప్రాధాన్యత ఇస్తున్నారు..? సిబ్బంది నియామకంలో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలాంటివి జరగకుండా పారదర్శకంగా ఉండాలన్నారు.మిగతా సివిల్ వర్క్ ఎంత వరకు పూర్తి అయ్యింది , పూర్తి కాకా పోతే ఎప్పటి వరకు పూర్తి అవుతుందని , పేషెంట్ లకు అని సౌకర్యాలతో బిల్డింగ్ లు అందుబాటులోకి ఎప్పుడు వస్తాయని అడిగారు.బిల్డింగ్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తామని గతంలో చెప్పిన వాయిదాలు దాటిపోయాయని గుర్తు చేస్తూ తర్వగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా , మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా , డిప్యూ డైరెక్టర్ డాక్టర్ విపిన్ వర్గీస్ పాల్గొన్నారు.
4 1 minute read