తెలంగాణహోమ్

బిజెపితోనే చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధ్యం

తెలంగాణ న్యూస్ చేర్యాల ప్రతినిధి:బిజెపితోనే చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధ్యమవుతుందని పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి అన్నారు. స్థానిక వాసవి గార్డెన్ లో చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధనకై భవిష్యత్తు కార్యాచరణ సమావేశం పట్టణ అధ్యక్షుడు మన్నె సత్య వర్ధన్ అధ్యక్షతన జరగగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చేర్యాల కొమరవెల్లి మద్దూరు దూలిమిట్ట మండల ప్రజల యొక్క బాగోగులు గత పది సంవత్సరాలుగా పట్టించుకోని బీఆర్ఎస్ పార్టీ నేడు కాలయాపన కోసమే ఉద్యమం చేస్తుందని ఈ పేరుతో ప్రాంత ప్రజలను వంచిస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో డివిజన్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. రాబోయే రోజుల్లో బిజెపి ఆధ్వర్యంలో డివిజన్ కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. డివిజన్ కోసం గురువారం జరిగే ధర్నాకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరు కావడం లేదని వారు తెలిపారు. డివిజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఏర్పాటుచేసిన జేఏసీలకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం లేదని భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉ మారాణి, నాయకులు శివరాజ్ యాదవ్, దండ్యాల లక్ష్మారెడ్డి, నాగరాజు, ఉదయ రెడ్డి, కోడం యాదగిరి, అంకుగారి శశిధర్ రెడ్డి, ముచ్చంతుల సిద్ధారెడ్డి, దండ్యాల బిక్షపతి రెడ్డి, నర్రా మహేందర్ రెడ్డి, కొట్టే చంద్రమౌళి, కర్కా తిరుపతిరెడ్డి, కుర్రారం బాల నరసయ్య, ఉప్పల నాగరాజు, మడికొండ శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, బింగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Back to top button