
- ‘జూనియర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా జక్కన్న
- ఈ నెల 18న విడుదల కానున్న మూవీ
- ఈ ఈవెంట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న రాజమౌళి
- తన బెస్ట్ ఫిల్మ్ ‘ఈగ’ అని రివీల్ చేసిన దర్శకుడు
- హీరోయిన్ జెనీలియా అందంపై జక్కన్న క్రేజీ కామెంట్
రాజమౌళి తాజాగా ‘జూనియర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లోనే జక్కన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
జక్కన్న బెస్ట్ ఫిల్మ్ ‘ఈగ’
యాంకర్ సుమ, రాజమౌళి తెరకెక్కించిన సినిమా పోస్టర్లు, షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను స్క్రీన్ పై చూపిస్తూ వాటి గురించి అడిగారు. ఈ క్రమంలోనే ఈగ సినిమాకు సంబంధించిన ఫొటో ఒకటి వేయగానే, దానికి రాజమౌళి వెంటనే ‘ఇది ఈగ సినిమాకు సంబంధించింది. నా బెస్ట్ మూవీ అది’ అని చెప్పారు. దీంతో రాజమౌళి తీసిన చిత్రాల్లో తనకు ఈగ బెస్ట్ అని తెలిసిపోయింది.
హీరోయిన్ జెనీలియా అందంపై రాజమౌళి క్రేజీ కామెంట్
సీనియర్ నటి జెనీలియా ఈ మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి కూడా రాజమౌళి మాట్లాడారు. జెనీలియా ఏం మారలేదని, ఆమె అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని జక్కన్న అన్నారు. ‘జెనీలియా అప్పటికి, ఇప్పటికి ఒకేలా ఉంది. అదే అందం, అదే గ్రేస్. ఈ సినిమాలో కొత్త జెనీలియాను చూస్తారని సెంథిల్ ప్రామిస్ చేశాడు. అందుకే నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని జెనీలియా గురించి చెప్పారు.
హీరో కిరీటిపై ప్రశంసలు
అలాగే హీరో కిరీటి సినిమాలో బాగా నటించారని తనకు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ చెప్పారని అన్నారు. వాళ్లిద్దరూ అలా చెప్పారంటే ఆ స్టేట్మెంట్ కు తిరుగు ఉండదని అన్నారు. ఇక, జూనియర్ సినిమాకు రాధాకృష్ణారెడ్డి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ‘సై’ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పిందని రాజమౌళి పేర్కొన్నారు. ‘సింహాద్రి’ తర్వాత తనపై పడిన మాస్ డైరెక్టర్ ముద్రను ‘సై’ సినిమాతో చెరిపేసుకోగలిగానని చెప్పారు. “రగ్బీ అనే కొత్త క్రీడ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తీసిన ఆ చిత్రం, నాకు నచ్చిన కథలను నమ్మకంతో తీయవచ్చనే ధైర్యాన్ని ఇచ్చింది” అని వివరించారు. ఇదే వేదికపై ప్రభాస్ తో ఉన్న ఫోటోను చూసి, ఆయన ఫుడ్ ప్రేమను సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇప్పటికే విడుదలైన వైరల్ వయ్యారి అనే సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. అలాగే ఈ మూవీ 1000కి పైగా స్క్రిన్స్‌లో ప్రదర్శితం కానుంది.