
- నెట్ ఫ్లిక్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3
- బాలకృష్ణ, అనసూయ, రాజీవ్ కనకాలతో ఏఐ వీడియో
- దుమ్మురేపిన బాలయ్య!
ఈ ఏఐ వీడియోలో బాలకృష్ణతో పాటు నటి అనసూయ భరద్వాజ్, నటుడు రాజీవ్ కనకాల కూడా ‘స్క్విడ్ గేమ్’ ఆటల్లో పాల్గొన్నట్లు చూపించారు. బాలకృష్ణ సినిమాల్లోని ఆయన ఐకానిక్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ఈ వీడియోను రూపొందించారు. ‘స్క్విడ్ గేమ్’లోని టఫ్ ఛాలెంజ్‌లను బాలయ్య తనదైన స్టైల్‌లో ఎదుర్కొని, ప్రత్యర్థులను దబిడి దిబిడే చేస్తూ కనిపిస్తారు.
ఈ వీడియోలోని హాస్యం, బాలయ్య ఎనర్జీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ అవుతూ, అభిమానులు దీనిపై స్పందిస్తున్నారు. “బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే.. అందరూ అయిపోయినట్లే!” అంటూ కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. బాలకృష్ణ యాక్షన్ సినిమాల్లో చూపించే డైనమిక్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీని ఈ గేమ్‌లో ఊహించడం అభిమానులకు కొత్త థ్రిల్‌ను అందిస్తోంది. అనసూయ, రాజీవ్ కనకాల కాంబినేషన్ కూడా ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ ఏఐ వీడియో అభిమానులకు హాస్యాన్ని, ఉత్సాహాన్ని అందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా నిలిచింది.