ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బంధంపల్లి గ్రామంలో నెలకొల్పిన బొడ్రాయి 16 రోజుల పాటు గ్రామస్తుల భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు భలి దానాలు అందించారు. గ్రామస్థుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానము, హరినామ సంకీర్తనతో భక్తి శోభ పెల్లుబికింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బొడ్రాయిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు.