
- ఈ నెల 24న వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన అధికారులు
- లేక్ వ్యూ అతిథి గృహంలో స్టేట్‌మెంట్ ఇవ్వాలని పేర్కొన్న సిట్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల వాంగ్మూలం తీసుకుంటున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 24న ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం అందించింది. స్టేట్‌మెంట్ ఇవ్వడానికి హైదరాబాద్‌లోని లేక్ వ్యూ అతిథి గృహానికి రావాలని సూచించింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సిట్ పలువురు నేతలను పిలిచి వాంగ్మూలం తీసుకుంటోంది.