
- పహద్ ఫాజిల్ చేతిల వెర్టు ఫోన్
- ధర రూ.7.79 లక్షలు
- సింప్లిసిటీలోనూ లగ్జరీ అంటున్న అభిమానులు
ఫహద్ ఉపయోగించిన ఈ ఫోన్ బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ వెర్టు (Vertu) నుంచి వచ్చిన ‘వెర్టు అసెంట్ రెట్రో క్లాసిక్ కీప్యాడ్ ఫోన్’. చూసేందుకు ఈ ఫోన్ సాధారణ కీప్యాడ్ ఫోన్లా కనిపించినా, దాని హస్తకళా నైపుణ్యం, టైటానియం, లెదర్, సఫైర్ క్రిస్టల్ వంటి ఖరీదైన మెటీరియల్స్‌తో తయారైన లగ్జరీ ఫోన్. ఈ ఫోన్లో 2-అంగుళాల QVGA సఫైర్ క్రిస్టల్ డిస్ప్లే, 3G/క్వాడ్ బ్యాండ్ GSM, బ్లూటూత్, మైక్రో USB కనెక్టివిటీ, 3-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా, 4GB ఆన్‌బోర్డ్ మెమరీ, వెబ్ బ్రౌజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫహద్ ఫాజిల్ స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియా ఖాతాలు లేకుండా సరళ జీవన శైలిని అనుసరిస్తారని ఆయన సహనటుడు వినయ్ ఫోర్ట్ గతంలో వెల్లడించారు. అయితే, ఈ వెర్టు ఫోన్ ధర గురించి తెలిసిన అభిమానులు ‘సింప్లిసిటీలోనూ లగ్జరీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ వెర్టు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో లేదు, దీంతో ఫహద్ దీన్ని చాలా కాలం కిందటే కొనుగోలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
మరోవైపు, ఫహద్ ఫాజిల్ సినిమా పరంగా కూడా బిజీగా ఉన్నారు. ‘ఒడుం కుతిర చాడుం కుతిర’, ‘కరాటే చంద్రన్’, ‘మారీసన్’ వంటి చిత్రాలతో పాటు మోహన్‌లాల్, మమ్ముట్టితో కలిసి ‘పేట్రియాట్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు.