తాజా వార్తలు

ప్లాస్టిక్ కప్పులలో టి అమ్మే షాపులపై చర్యలు తీసుకోవాలి.

ప్రజా ఆరోగ్యాన్ని కాపాడండి

బెల్లంపల్లి ఫిబ్రవరి 14 ప్రజావాణిమంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ప్లాస్టిక్ కప్పుల లో టీ అమ్మే బేకరీ షాపులు, టీ షాప్ లలో ప్లాస్టిక్ కప్పుల లో టీ వాడకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తాండూరు మండల ఇన్చార్జ్ దాసరి శ్రీనివాస్ తాండూర్ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అశోక్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ సంబంధించిన అన్నిటిపై నిషేధం విధించిందని అయినను ప్రజలలో అవగాహన కరువై ప్లాస్టిక్ ను అధికంగా వాడుతున్నారని అన్నారు. కూరగాయల వ్యాపారులు సైతం ప్లాస్టిక్ రహిత సంచులను అమ్మేలాప్రోత్సహించాలని కోరుతున్నామన్నారు. ప్లాస్టిక్ కప్పుల లో టీ తాగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు సైడ్ ఎఫెక్టులు వస్తాయి కనుక సంబంధిత టీ షాప్ లపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కంటెస్టెడ్ స్వతంత్ర అభ్యర్థి సాలిగమా మల్లేష్,సిపిఐ మండల కార్యదర్శి సాలిగమ సంతోష్, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు ఆసమ్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Back to top button