పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకున్నది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్కు ముందు మ్యాచ్లో పాల్గొనే జట్ల జాతీయ గీతాలాపన జరిగే విషయం తెలిసిందే.

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకున్నది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్కు ముందు మ్యాచ్లో పాల్గొనే జట్ల జాతీయ గీతాలాపన జరిగే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల క్రికెటర్లు జాతీయ గీతాపాలన కోసం నిల్చున్నారు. ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా నిర్వాహకులు భారత దేశ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. దాంతో స్టేడియంలో అభిమానులంతా కేకలు వేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వెంటనే తప్పును గ్రహించిన నిర్వాహకులు భారత జాతీయ గీతాన్ని నిలిపివేసి.. ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అయితే, అప్పటికే భారత జాతీయ గీతంలోని ‘భారత భాగ్య విధాత’ వరకు ప్లే అయ్యింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పాక్పై పలువురు క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు