స్పెషల్ ఫోకస్

పథకాలు పంచుడు -పన్నులు దంచుడు

ఏ ప్రభుత్వమైన
ఉచిత పధకాలను తెచ్చుడు
ప్రజలకు పంచుడు
పన్నులేసి వసూలుచేసుడు

ఎన్నికలోచ్చినపుడు
ఎదో కొత్త పథకం
ఓటర్లను ఆకర్శించడానికి
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి

ఆస్తులను తాకట్టు పెట్టుడు
అప్పులమీద అప్పులు చేసుడు
అధిక ధరలను, బ్లాక్ దందాలను అదుపుచేయక
అన్ని ఉచితమని చెప్పుడు
వడ్డీలభారం మోసుడు

ప్రజల సొమ్ము
ప్రజలకే పంచుడు
కమీషనల పేరున కొంత
దుర్వినియోగం మరికొంత

క్షేత్రస్తాయి విచారణ చేయకుండా
అర్హులను గుర్తించకుండా
అందరికి ఉచితమంటూ
పధకాలను అమలుచేస్తే

అప్పు తీర్చడానికి
వడ్డీలు చెల్లించడానికి
ఖజానా ఖాళీ అయి
ప్రజలపై పన్నుల భారం పడుతుంది

ఇంతకు దేశం అభివృద్ధి చెందుతున్నట్ల, నెమ్మదించినట్ల
దేశ సంపద కూడబెడుచున్నట్ల
తాకట్టులో ఉంచినట్ల

దేశ పురోగతికి సమయం పట్టిన
అప్పులులేని అభివృద్ధి కావాలి
అవసరపు మేర అప్పుచేయాలి
అట్టడుగువర్గాలకు లబ్దిచేకూరాలి

ముందుగా ఆదాయం ఉండి
పన్నుఎగవేతదారులనుండి
వసూలుచేయాలి, ప్రభుత్వం ఆర్ధికవనరులను
సమకూర్చుకోవాలి

కొందరి స్వార్ధానికి
అందరిని బలిచేయవద్దు
నిజమైన లబ్దిదారునికి
అన్యాయం కావద్దు

ప్రభుత్వంలోని మేధావులు అలోచించి
పధకాల రూపకల్పన చేసి
పన్నుల భారం పడకుండా
పాలకులకు చెడ్డ పేరు రాకుండ చూడాలి.

రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్

Show More

Related Articles

Back to top button