తెలంగాణ న్యూస్, కొమురవెల్లి: శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజు చిన్న పట్నం, చిన్న అగ్నిగుండాలు జరిగే తోట బావి వద్ద ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, హుస్నాబాద్ ఏసీపీ సతీష్, సిసిఎస్ ఎసిపి యాదగిరి, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ను పరివేక్షించారు. బందోబస్తు నిర్వహించే అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. చిన్న పట్నం చిన్న అగ్నిగుండాలకు వచ్చే భక్తులు కూడా పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతంగా పండుగలు జరుపుకొని వెళ్లాలని సూచించారు. టెంపుల్ చుట్టూ ఆవరణము తోట బావి పదింతర ప్రాంతాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని 24X7 సీసీ కెమెరాలు మానిటర్ చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి, గజ్వేల్ అడిషనల్ సీఐ ముత్యం రాజు, చేర్యాల సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
4 Less than a minute