సంస్థాన్ నారాయణపురం న్యూస్ ఫిబ్రవరి 12:నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని చౌటుప్పల్ కోర్ట్ బారసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ మరియు బార అసోసియేషన్ సభ్యులతో కలిసి లాయర్స్ ఫోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి కురుమ ప్రభుత్వ ప్రతినిధి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లైబ్రరీ కార్యదర్శి మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి మాట్లాడుతూ 1.రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా శాసనసభలో బిల్ పాస్ చేయాలని తెలియజేశారు 2. చౌటుప్పల్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు 3. జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం 5000 రూపాయలు చెల్లించాలి 4. ఎక్కువ కేసులు చౌటుప్పల్ కోర్టులో పెండింగ్లో ఉన్నందున రెగ్యులర్ పిపిని అపాయింట్ చేయాలని కోరారు వీటితోపాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ విద్యావంతులైన యువకులైన బిసి అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు మేము తెలియజేసిన అన్ని విషయాలను సావధానంగా విన్న ప్రభుత్వ ప్రతినిధి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తోటి మాట్లాడి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ కోర్టు బార అసోసియేషన్ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాపోలు వేణు, వైస్ ప్రెసిడెంట్ తాడూరి పరమేష్, మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీనియర్ న్యాయవాది ఎస్సార్ బిక్షపతి, అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు ముశం చంద్రశేఖర్, రాం ప్రతిజ్ఞ చారి తదితరులు పాల్గొన్నారు
0 1 minute read