తెలంగాణ న్యూస్,ఖమ్మం:
ప్రాణప్రయస్థితిలో అత్యవసర సేవలందిస్తున్న 108 అంబులెన్స్ రిపైర్స్ వస్తున్నాయన్న నేపథ్యంలో అదే స్థానంలో నూతన అంబులెన్స్ ను ప్రభుత్వ అందించింది.అత్యవసర సర్వీసులో పేషెంట్ కు ఉపయోగించే పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ దుర్గాప్రసాద్ సందర్శించి పరికరాల పనితీరును పరిశీలించారు.మండలంలో ఎలాంటి అత్యవసర సర్వీస్ కైనా ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించి అనేకమంది ప్రాణాలను కాపాడటంలో ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈఎంటి కృష్ణయ్య,నాన్నయ్య పైలెట్లు వీరయ్య,సక్రు పాల్గొన్నారు.