ఆంధ్రప్రదేశ్

త్రిబుల్ ఐటీ ఫలితాల్లో మర్రిపూడి మండలం నుండి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు…

మండల విద్యాశాఖ అధికారి రంగయ్య...

తెలంగాణన్యూస్ :కాకర్ల -మర్రిపూడి):

మర్రిపూడి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ప్రభుత్వం ప్రకటించిన త్రిబుల్ ఐటి ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు సీట్లు పొందినట్లుగా మండల విద్యాశాఖ అధికారి ఇ.వి.రంగయ్య తెలియజేశారు. కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఉలవపాటి నిహారిక, చల్లపల్లి తులసి, మూలే ప్రత్యూష, రమావత్ సాయి సాత్విక, అట్లా బాల మనోహర్ రెడ్డి ఐదుగురు విద్యార్థులు,మర్రిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి గరిజాల పల్లవి, గురిజాల దీపిక ఇద్దరు విద్యార్థులకు నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ నుండి సీట్లు పొందినట్లుగా తెలియజేశారు. ఈనెల 30వ తేది నుండి నూజివీడు క్యాంపస్ నందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగునని తెలియజేశారు.

Show More

Related Articles

Back to top button