తెలంగాణ

*తాను చనిపోయి నలుగురికి పునర్జన్మనిచ్చిన చేగొమ్మ యువకుడు..*

*అవయవదానం తో చిరంజీగా నిలిచిన..బుర్ర మహేష్*

*మహేష్ నీకు జోహార్లు….*

*ప్రాణధాతకు అభినందనలు….*

*తాను చనిపోయి నలుగురికి పునర్జన్మనిచ్చిన చేగొమ్మ యువకుడు…….*

*అవయవదానం తో చిరంజీగా నిలిచిన..బుర్ర మహేష్*

*శోకసముద్రం లో చేగోమ్మ గ్రామ వాసులు*

తెలంగాణన్యూస్,ఖమ్మం:

తాను ప్రమాదవశాత్తు చనిపోయి తన అవయవాలు నలుగురికి దానం చేసి పునర్జన్మనిచ్చిన మహోన్నత్తులు…. *వివరాల్లోకి వెళ్ళితే……*

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ గ్రామానికి చెందిన యువకులడు బుర్ర మహేష్ ….. తాను బుధవారం ఉదయం తన పొలం దగ్గర పని ముగించుకొని తిరిగు ప్రయాణమై చేగొమ్మ వెళుతున్న క్రమంలో ప్రమాదావశాత్తు మోటార్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ఆసుపత్రికి చేరారు. మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించాగా గత నాలుగు రోజుల నుండి బ్రెయిన్ డెడ్ అయి కోమాలో ఉండగా…. బ్రతకడం కష్టం అని వైద్యులు తేల్చి చెప్పారు. కాగా పుట్టెడు దుఃఖంలో ఉండి కొడుకుని కోల్పోయి కూడా అతని తల్లీ తండ్రులు మరో నలుగురికి ప్రాణం నిలిపి వారిలో తన కొడుకుని చూసుకొంటామని భావించిన వారు శనివారం కుమారుడి అవయవాలు దానం చేయడానికి అంగీకరించటం గొప్ప మానవతకు తార్కానంగా పేర్కొనవచ్చు. అతడి ప్రధాన అవయాలు నలుగురి దానం చేసి వారికీ పునర్జన్మనిచ్చారు.ఈ విషయం తెలుకొన్న చేగోమ్మ గ్రామ ప్రజానీకం బంధువులు , మిత్రులు ఒక పక్క పుట్టెడు దుఃఖంలో ఉంటూ మరో పక్క నలుగురికి ప్రాణదానం చేయడానికి ముందుకు వచ్చిన మృతుడి తల్లిదండ్రులను వేనోళ్ళ కొనియాడుతున్నారు….అవయవాల దానం అనంతరం మృతుడి పార్ధీవ దేహాన్ని శనివారం మధ్యాహ్నం చేగొమ్మ క్రాస్ రోడ్డు వరకు తీసుకొని రాగ బంధు, మిత్రులు చేగొమ్మ క్రాస్ రోడ్డు నుండి పెద్ద ఎత్తున బానసంచా కాలుస్తూ డిజే సౌండ్ సిస్టమ్తో వందలాది మంది అశృతనయనాల మధ్య బారీ బైకుల్లో ఊరేగింపుగా దాదాపు మూడు కిలో మీటర్ల మేర తీసుకెళ్లి దహన సంస్కారాలు గావించాయి. ఎక్కడ చుసిన పెద్ద ఎత్తున … మహేష్ అమర్ రహేగా…….

అంటూ దిక్కులు పిక్కెటిళ్లేలా (మారుమోగేలా) నినాదాలు చేశారు. ఏది ఏమైనా మాములు గ్రామీణ ప్రాంతంలో పుట్టి, మధ్యతరగతి కుటుంబంలో పెరిగి ఒక వైపు పుట్టెడు దుఃఖం లో ఉండి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవడంతో ఆ తల్లీ దండ్రులయినా వీరబాబు దంపతులకు ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టుకొని అభినందించటం విశేషంగా చెప్పవచ్చు.

Show More

Related Articles

Back to top button