కోరుట్ల మార్చి 04 తెలంగాణ న్యూస్స్వచ్ఛ సర్వేక్షన్ 2024-25 లో భాగంగా కోరుట్ల మున్సిపల్ మున్సిపల్ కమిషనర్.ఆధ్వర్యంలోమంగళవారం పట్టణంలోని పలు వార్డులలో పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడకం నిషేధ పై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ, ప్రజలు తమ ఇంటి నుండి వచ్చే వ్యర్ధాలు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి, తడి చెత్త ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్త నీలిరంగు డబ్బాలో వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని కోరారు. తడి చెత్తను కంపోస్ట్ సెంటర్ కు తరలించి ఎరువుగా తయారు చేస్తామని, పొడి చెత్తను డి.ఆర్.సి.సి, సెంటర్ కు తరలిస్తామని అన్నారు. కావున తడి చెత్త, పొడి, హానికార చెత్తను వేరు చేయుటకు ప్రజలందరూ సహకరించగలరని కోరారు.