
- ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
- వరుస సమావేశాలతో బిజీగా చంద్రబాబు
- చంద్రబాబును కలిసి స్వర్ణాంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ వరుస సమావేశాలతో చంద్రబాబు ఎంతో బిజీగా గడిపారు. ఈ క్రమంలో, స్వర్ణాంధ్రప్రదేశ్-2047పై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందం ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసింది. ఏపీ ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిపై తాము రూపొందించిన నివేదికను ఆయనకు అందజేసింది.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తదుపరి ఏడాది రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. విశాఖపట్నం నగరానికి గూగుల్ వస్తోందని… విశాఖతో పాటు తిరుపతి, విజయవాడ నగరాలు కూడా వాణిజ్యానికి అనుకూలమని వెల్లడించారు.