మండల కేంద్రంలోని 7న జరిగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం జి పి ఫోరం జిల్లా నాయకులు జీడిమడ్ల రవీందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న మందకృష్ణ మాదిగ మద్దతుగా జర్నలిస్టులు ఫోరం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆశయాల సాధన కోసం అనునిత్యం మాదిగ మరియు ఇతర ఉపకులాల భవిష్యత్తుల కోసం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ నేడు రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణకు పోరాడుతున్న మొట్టమొదటి వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలకు అతీతంగా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మందకృష్ణ మాదిగ. నేడు హైదరాబాదులో జరుగుతున్నటువంటి లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని డప్పు పై దండోరా పడితే మాయన్న ఢిల్లీలో గుండె అదరాలి. మాయన్న అంటూ ఊరు వాడ ప్రతి ఒక్క దళితుడు డప్పును వేసుకొని బయలుదేర వలసిన అవసరం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ బి రాములు కలకొండ సంజీవ సిరిపంగి బాలరాజు చింతకింది సుధాకర్. వలిగొండ యాదయ్య ముత్యాల చంద్రకాంత్ వడ్డేపల్లి వంశీ చెరక్కుపల్లి కృష్ణ కట్ట లింగస్వామి జనగాం కిరణ్ తదితరులు పాల్గొన్నారు
37 1 minute read