ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు

చైనాలో కొవిడ్‌ తరహా కొత్త వైరస్‌

నాకు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకమైన కరోనా వైరస్‌ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కేయూ5-కోవ్‌-2గా పిలుస్తున్నారు. కొవిడ్‌-19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2ను ఈ వైరస్‌ పోలి ఉందని, మనుషులకు సైతం ఇది సోకగలదని తేల్చారు.

చైనాలో కొవిడ్‌ తరహా కొత్త వైరస్‌
  • 1 : చైనాకు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకమైన కరోనా వైరస్‌ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కేయూ5-కోవ్‌-2గా పిలుస్తున్నారు. కొవిడ్‌-19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2ను ఈ వైరస్‌ పోలి ఉందని, మనుషులకు సైతం ఇది సోకగలదని తేల్చారు. గబ్బిలాల్లో వైరస్‌లపై అధ్యయనాలతో ‘బ్యాట్‌వుమన్‌’గా ప్రాచుర్యం పొందిన షి జెంగ్లీ అనే వైరాలజిస్ట్‌ నేతృత్వంలోని పరిశోధకులు ఈ వైరస్‌ను గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘సెల్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ వైరస్‌ మెర్బెకోవైరస్‌ ఉప రకానికి చెందినదని, ఇందులో మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(బెర్స్‌) వైరస్‌ కూడా ఉందని పరిశోధకులు తెలిపారు. ఇది హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ గబ్బిలాల్లో మొదటిసారి గుర్తించిన హెచ్‌కేయూ5 కరోనా వైరస్‌ శ్రేణికి చెందినదని చెప్పారు. ఈ వైరస్‌ మనుషులకు నేరుగా లేదా ఇతర జీవాల ద్వారా సోకే ముప్పు ఉందని హెచ్చరించారు. అయితే, కొవిడ్‌-19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 కంటే దీని ప్రభావం తక్కువే ఉంటుందని వెల్లడించారు.
Show More

Related Articles

Back to top button