రాజకీయం

 చేరుకున్న చలో కొత్తగూడెం యాత్ర

బెల్లంపల్లికి విచ్చేసిన మారుపేర్ల నాయకులకు పూలమాలలతో స్వాగతం పలికి వారికి మద్దతుగా పాద యాత్రలో పాల్గొని బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్లడం జరిగింది అనంతరం అంబేద్కర్ కి పూలమలవేసి మారుపేర్ల సమస్యపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
మారుపేర్ల కార్మికులకు వారి పిల్లలకు వెంటనే న్యాయం చేయాలి. వారి న్యాయమైనా డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి.అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను,నెరవేర్చుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది.
మారుపేర్ల కార్మికుల యాత్రకు విచ్చేసిన నాయకులకు మద్దతుగా నిలుస్తున్నాం. వారి భవిష్యత్ కార్యాచరణకు కూడా తోడుంటాం.వారి యాత్ర కొత్తగూడెం కు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాం.వారి న్యాయమైన డిమాండ్ నీ గుర్తుంపు సంఘం ఏఐటియూసీ రాబోయే స్టక్చర్ మీటింగ్ లో మాట్లాడి వెంటనే మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది.యాజమాన్యం వెంటనే మారుపేర్ల పైన నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మారుపేర్ల నాయకులు ఎస్ ఓ ఎస్ కె ఎస్ నాయకులు, బీ ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రవణ్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Back to top button