తాజా వార్తలు

చల్మెడ లో ఉచిత మెగా వైద్య శిబిరం

తెలంగాణ న్యూస్:రామయంపేట ప్రతినిధినిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు దొంతర బోయిన మధు ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో మల్లారెడ్డి ఆస్పత్రి వైద్యురాళ్ళు ఎన్.అభిజ్ఞ, వై. యుక్తిక రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో బిపి షుగర్ దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలునిర్వహించారు. ఎవరికైనా శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి హైదరాబాదులోని జీడిమెట్ల మల్లారెడ్డి హాస్పిటల్స్ కు రిఫరల్ చేశారు. ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో హైదరాబాద్ జీడిమెట్ల మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యులు ఎన్. అభిజ్ఞ, వై.యుక్తిక, నర్సింగ్ స్టాఫ్ సునీత,ఫాతిమా, మల్లారెడ్డి హాస్పిటల్ మార్కెటింగ్ఎగ్జిక్యూటివ్స్ ఎస్. దేవరాజ్ కే. భరత్ రెడ్డి, గ్రామ బిజెపి నాయకుడు దొంతర బోయిన మధు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Show More

Related Articles

Back to top button