తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ !!మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ !!కొండొక గుజ్జురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి !!పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!!ఓం దక్షిణోమా మహేశ్వరాయ నామః
అర్దం – రతీమన్మధులు పశ్చిమ దిక్కున కలవాడు.అనగా గణపతి భార్యాభర్తల మధ్య మంచి సాన్నిత్యాన్ని ఇస్తాడు. చక్కని సంసార జీవితాన్ని ఇస్తాడు. భౌతిక జీవనాన్ని ధర్మబద్ధంగా, సంపూర్ణంగా అనుభవిస్తే తృప్తి కలుగుతుంది. అది క్రమంగా వైరాగ్యనికి దారి తీస్తుంది. వైరాగ్యం జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. దీనికి మూలం చక్కని సంసారిక జీవనంలో ఉంది, భార్యాభర్తల మధ్య సఖ్యతలో ఉంది. అది ప్రసాదించేవాడు గణపతి.ఓం వహివరహ వామాంగయ నమః !!అర్దం – మహీ అంటే భూమి. సకల సంపదలకు నిలయం. అలాంటి భూదేవి, భూమాతను ఉద్ధరించిన వరహామూర్తి ఉత్తర దిక్కున …ఓం దక్షిణోమ మహేశ్వరాయణ మహఃఅర్దం – దక్షిణ దిశలో ఉమామహేశ్వరులు ఆవరణ దేవతలుగా కలవాడు. అనగా గణపతికి దక్షిణ దిశలో ఉమా, మహేశ్వరులు కొలువై ఉంటారు. గణపతి ఉపాసనలో వీరిని కూడా ఆరాధించాలి.
1 Less than a minute