తాజా వార్తలు

కోరట్ల గూడెం లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు

తెలంగాణ న్యూస్:నేలకొండపల్లి మండలం కోరట్ల గూడెం లో రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా వచ్చిన 20 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని వారు తెలిపారు. ఈనెలలోనే ఇందిరమ్మ ఇళ్ళురైతు భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం ప్రారంభించబోతోందని వారు పేర్కొన్నారు.రైతులకు రెండు లక్షల రుణమాఫీ తో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వారు కొనియాడారు.ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్ బచ్చలకూరి నాగరాజు జెర్రిపోతుల అంజని మామిడి వెంకన్న కొత్తపల్లి సుబ్బారావు మాజీ సర్పంచ్ బచ్చలకూరి పెద్ద మైసయ్య ఎం వెంకట్రామయ్య ఊటుకూరు కుటుంబరావు గోళ్ల రామయ్య గుండా చంద్రశేఖర్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు గుండా రామయ్య షేక్ యాకుబ్ కనతాల హనుమంతరావు బచ్చలకూరి నరసయ్య సుంకర భూ చక్రవర్తి షేక్ సైదా సోమన బోయిన నవీన్ షేక్ లాల్ పాషా మహబూబ్ పాషా నజీర్ పాషా,దుబాయ్ పాషా,గడిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు

Show More

Related Articles

Back to top button