
- ఇప్పటికే 16 సీజన్‌లు పూర్తి చేసుకున్న కేబీసీ
- ఆగస్టు 11న 17వ సీజన్ ప్రారంభం
- కొత్త సీజన్ ప్రోమోను విడుదల చేసిన సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్
- ఈ సీజన్‌కు కూడా అమితాబ్ బచ్చనే హోస్ట్
పాప్యులర్ రియాలిటీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 16 సీజన్‌లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. మరోవైపు ఈ ఏడాది ‘కేబీసీ’ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిని కూడా చేరుకుంది. 2000 జులై 3న ప్రారంభమైన ఈ షో ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఇక, ఈ షో కొత్త సీజన్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ చాలా ఆసక్తికరంగా రూపొందించింది. ఎప్పటిలాగే ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
కాగా, ఈ కొత్త సీజన్ ఆగస్టు 11న ప్రారంభం అవుతుందని తాజాగా ప్రకటించారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌తో పాటు సోనీ లివ్ లో ప్రసారం కానుంది.