శ్రీ గురుభ్యోనమః
శ్రీ సాక్షి గణపతయే నమః
శ్రీ లక్ష్మీ గణపతయే నమః
శ్రీ లక్ష్మీదుర్గా ముళ్ళమాంబికాదేవ్యై నమః
🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏
ప్రధమ స్కంధము16 వ భాగంఈ విధంగా అర్జునుడు కల్పించిన శరతల్పం మీద శయనించి ఉన్న కురుకుల పితామహుడు పలికిన పలుకులు అచ్చటకు విచ్చేసిన మునులందరూ విన్నారు. అప్పుడు ధర్మనందనుడు గంగానందనుడైన ఆచార్య భీష్ముని వలన మానవజాతికి అవశ్యాలైన సామాన్యధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దానధర్మాలు, రాజధర్మాలు, స్త్రీధర్మాలు భగవంతునికి ప్రియమైన భాగవతధర్మాలు, శమదమాదులు, చతుర్విధ పురుషార్ధాలైన ధర్మార్థకామమోక్షాలు, నానా విధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు మొదలైనవి అన్నీ కొన్ని సంక్షేపంగానూ, కొన్ని వివరంగానూ విన్నాడు. తర్వాత మహారథులకు శిరోభూషణమైన భీష్ముడు స్వచ్ఛందమరణులైన సంయమీంద్రులు వాంఛించే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకొని, అది తాను తనువు చాలించటానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకొన్నాడు.శా.ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృగ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యథా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజ శ్రేణీహరిన్ శ్రీహరిన్.అప్పుడు గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకుని తన చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు. ఆ కమలాక్షుని దాక్షిణ్యమయవల్ల, కటాక్షవీక్షణంవల్ల, ఆయన శరీరంమీది గాయాలబాధ ఉపశమించింది. అప్పుడు శాంతిశీలుడైన శాంతనవుడు సంతోషించి కలుషాలనే గజసమూహాన్ని చించి (చీల్చి) చెండాడే యదుసింహుణ్ణి నుతించాడు.మందాకీ నందనుడైన భీష్ముడు సమస్త దోషాలనూ, పరాస్తం చేసి, నిష్కామభావంతో, నిర్మలధ్యానంతో పీతాంబరధరుడూ, చతుర్భుజుడూ, పురాణపురుషుడూ, పరమేశ్వరుడూ అయిన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానందభరితుడై స్వభావసిద్ధాలైన సంసారబంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈవిధంగా ప్రస్తుతించాడు-భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట:-మ.త్రిజగన్మోహననీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీరజబంధప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మావిజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణకాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ, బాలభానుప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో, ఒయ్యారం ఒలకబోస్తూ, నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముఖారవిందంతో, అనురాగాలు చిందిస్తూ మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలి!”మ.హయ రింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమైరయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చు వేడ్క నని నాశస్త్రాహతిం జాల నొచ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
గుర్రాల గిట్టలు రేపిన దుమ్ము కొట్టుకొని, రంగుచెడి చెదరిన ముంగురులతోనూ, గమనవేగంవల్ల కందళించిన ఘర్మబిందువులతోనూ, కూడి, ముచ్చటగొల్పే ముఖం కలవాడై, కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా, వివ్వచ్చుణ్ణి ప్రోత్సాహించి, పోరించిన మహానుభావుణ్ణి మనస్సులో అశ్రాంతమూ ధ్యానిస్తున్నాను.మ.
నరు మాటల్ విని, నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలోఁబరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుంబరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు, నీపరమేశిండు వెలుంగు చుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.అర్జునుని మాటలు ఆకర్ణించి, చిరునవ్వు నవ్వుతూ పగవారు చూస్తుండగా పాండవ కౌరవ సైన్యాల మధ్యప్రదేశంలో ‘తేరు’ నిలిపి, పేరుపేరునా వైరిపక్షంలోని వీరులను చేయెత్తి చూపిస్తూ, తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు నా హృదయపద్మంలో పద్మాసనం పైన భాసిల్లుతున్నాడు.క.తనవారిఁ జంపఁజాలక, వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్ఘనయోగవిద్యఁ బాపిన మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుకంజ వేస్తున్న ధనంజయునికి గీతోపదేశం చేసి, సందేహాలను పోగొట్టి, ముందంజ వేయించిన మునిజనవంద్యుడైన ముకుందుని పాదభక్తి నాలో పరిఢవిల్లాలి!”సీ.కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి గగనభాగంబెల్లఁ గప్పికొనఁగనుఱికిన నోక యుదరంబులో నున్న జగముల వ్రేఁగున జగతి గదలఁజక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ బై నున్న పచ్చని పటము జాఱ*నమ్మితి నాలావు నగుఁబాటు సేయక మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ
2 1 minute read