జమ్మికుంట జూన్ 24 జమ్మిట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కలగూడెం గ్రామానికి చెందిన పొనగంటి రాజు ఐస్లాండ్ వారు నిర్వహించిన యువర్ ఫోటో వరల్డ్ లో తన ప్రతిభను కల్పించగా గోల్డ్ మెడల్ సాధించారు. ఈ యొక్క కాంపిటీషన్ లో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల నుండి 550 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొనగా తనకు గోల్డ్ మెడల్ రావడం ఎంతో సంతోషంగా ఉందని రాజు అన్నారు. గ్రామీణ ప్రాంతంలో తనదైన శైలిలో ఫోటోషూట్స్ చేసి రకాల ఫోటోలను తన కెమెరాలో బంధించి వివిధ దేశాల నుండి ప్రశంస పత్రాలు గోల్డ్ మెడల్ సాధించి జమ్మికుంట పట్టణాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన రాజుకు పలువురు ఫోటోగ్రాఫర్లు అభినందనలు తెలిపారు.
0 Less than a minute