
- ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
- ముందుస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్
- ఇప్పటికే ఏపీ హైకోర్టులోనూ మిథున్‌రెడ్డికి చుక్కెదురు
కాగా, ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది.
దాంతో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. ముందుస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
మిథున్‌రెడ్డిపై ఇప్పటికే సిట్ లుకౌట్ సర్క్యూలర్
ఇక, మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా… ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని సర్క్యూలర్‌ల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు కనుక విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఆయనపై లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది.