తాజా వార్తలు

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు ‘పాన్ పాన్ పాన్’ అంటూ అత్యవసర సిగ్నల్ ఇచ్చిన ఇండిగో పైలట్

Indigo Flight Makes Emergency Landing in Mumbai After Pan Pan Pan Call
  • ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన విమానం
  • భువనేశ్వర్ మీదుగా వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య
  • విమానాన్ని ముంబైకి మళ్లించమని పైలట్ అభ్యర్థన
  • ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు
ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానం గత రాత్రి ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన సమయంలో విమానం భువనేశ్వర్‌కు ఉత్తరంగా సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఎగురుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో పైలట్ ‘పాన్ పాన్ పాన్’ అని పేర్కొన్నాడు. ఇది ఒక అంతర్జాతీయ రేడియో డిస్ట్రెస్ సిగ్నల్. ఇది ప్రాణాంతకం కాని అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. రాత్రి 9:32 గంటల సమయంలో ముంబైకి మళ్లించమని అభ్యర్థించాడు.

ఇండిగోకు చెందిన ఈ ఎయిర్‌బస్ ఏ320 నియోలో ఆ సమయంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ‘ఇంజన్ నంబర్ 1లో సమస్య ఏర్పడిన కారణంగా పైలట్ ‘పాన్ పాన్ పాన్’ అని ప్రకటించాడు’ అని ఒక అధికారి తెలిపారు. ఈ సంఘటన రాత్రి 9:27 గంటల సమయంలో జరగ్గా, రాత్రి 9:53 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Show More

Related Articles

Back to top button