తాజా వార్తలు

ఉద్దానం కొబ్బరికి పెరిగిన మద్దత్తు ధర..

తగ్గిన దిగుబడి... పెరిగిన ధర

తెలంగాణ న్యూస్ప్రతినిధి మార్చి 24ఉద్దానం ప్రాంతంలోఇదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కొబ్బరి ధర ప్రస్తుతం పెరిగింది. కవిటి ఉద్దానంలో మొదటి రకం 1,000 కాయలు రూ.25 వేల వరకు పలుకుతోంది. మిగిలిన రకాలకు రూ.20 వేలకు పైగా అందుతోంది. కొన్నిచోట్ల ఒడిశా వ్యాపారులు ధర పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం కవిటి ఉద్దానం దిగుబడులకు మంచి ధర చెల్లిస్తున్నారు. మందస ఉద్దానం ప్రాంతానికి సంబంధించి,000 కాయలు రూ.17 వేల నుంచి రూ.21 వేల వరకు పలుకుతోంది. శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్దానం కాయకు గిరాకీ ఉంది.దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి ఒడిశా వ్యాపారులు స్థానిక మార్కెట్, ధర ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుండటంతో ఉద్దానం కాయకు మంచి ధర చెల్లించేందుకు అవకాశం ఏర్పడింది. వ్యాపారులు సరకును తోటల్లో నిల్వ చేయకుండా వెంటనే రవాణా చేస్తున్నారు.కవిటి ఉద్దానంలో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గింది. రికార్డు స్థాయి ధర పలుకుతున్నప్పటికీ రైతులకు పెద్దగా ప్రయోజనం లేదు. గతంలో ఎకరా తోటలో రెండు నెలలకు ఒకసారి 1,000 నుంచి 1,200 కాయల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 300 కాయలు రావడం లేదు. చీడపీడలు, వాతావరణ మార్పులతో పరిమాణం, దిగుబడి తగ్గిపోయాయి.ఒడిశా వ్యాపారుల ఆధిపత్యంనూనె, కొబ్బరి పరంగా నాణ్యత విషయంలో ఉద్దానం దిగుబడులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళి నుంచి శ్రీరామనవమి వరకు ఇక్కడి కాయలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. తిత్లీ తుపాను తరువాత ఇక్కడ దిగుబడులు లేకపోవడంతో ఉత్తరాదికి కోనసీమ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఉద్దానంలో పరిస్థితి మెరుగుపడటంతో మళ్లీ ఉత్తరాది మార్కెట్‌కు ఎగుమతులు పెంచేందుకు ఇక్కడి వ్యాపారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఒడిశా వ్యాపారుల ఆధిపత్యంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు కంచిలి మార్కెట్‌ నుంచి రోజుకు 25 లారీల్లో కొబ్బరికాయలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం వారానికి నాలుగైదు లారీల సరకు వెళ్లడం లేదు.
జిల్లాలో 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా ఉద్దానంలో 85 శాతం తోటలున్నాయి. కవిటి ఉద్దానంగా గుర్తింపు పొందిన కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాలు, సోంపేటలో కొంతభాగం తోటల నుంచి వచ్చే దిగుబడులకు ఒక ధర, మందస ఉద్దానంగా వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేటలో కొంతభాగం తోటల్లో వచ్చే దిగుబడులకు మరో ధర ఉంటుంది. కొబ్బరికాయ పరిమాణం, నాణ్యత, ఇతర అంశాల నేపథ్యంలో రెండు, మూడు, విభాగాలుగా వేరు చేసి ధరలు నిర్ణయిస్తారు. కవిటి ఉద్దానం కాయకు కొంతమేర ధర, గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం మద్దత్తు ఇవ్వక పోయిన పరిస్థితులు వల్ల ధర పెరగడము రైతులు మంచిది అంటున్నారు రైతులు

Show More

Related Articles

Back to top button