
తెలంగాణ న్యూస్:సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్‌లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ప్రతి ఏడాది ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల జాబితాను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. ఇందులో భాగంగానే తాజాగా మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది ఐఎండీబీ. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది