టీటీడీ అధికారులకు దిశానిర్ధేశం చేయనున్న సీఎం చంద్రబాబుచైర్మన్ బీఆర్ నాయుడు అదేశంతోటీటీడీ లో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభంటీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను గుర్తించిన అధికారులునవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం, ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొందినేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ…భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న కొందరు ఉద్యోగులుహిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే..టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు అదేశం18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలో చేయాలని ఉత్తర్వులుఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని అదేశంఅన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం[1:28 PM, 2/5/2025] TIRUMALA TIMES: పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఫిబ్రవరి 05ఫిబ్రవరి 11 నుండి 13వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంటీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11 నుండి 13వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది.ఫిబ్రవరి 11, 12వ తేదీలలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికిచినఉపదేశాలుతెలియజేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఫిబ్రవరి 13న ఉదయం 8.30 గంటలకు సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9.30 గంటల నుండి స్వామిజీలు ధార్మిక సందేశం ఇవ్వనున్నారు.ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్యప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
3 1 minute read