హైదరాబాద్

 ఇంట్లో నక్కి ఉండి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడా?… సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు

అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ ప్రవేశించని వైనం

CCTV cameras at Saif Ali Khans home did not capture anyone entering premises within two hours before attack
  • సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి నిర్ధారించిన పోలీసులు
  • ముందుగానే ఇంట్లో దాగున్నాడా? అని సందేహిస్తున్న పోలీసులు
  • కేసులో దర్యాప్తు ముమ్మరం… సీసీటీవీ ఫుటేజీ పరిశీలన

బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి ఘటనలో దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఒకపక్క ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తూనే, మరోపక్క సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో దాడి జరగగా, ఈ దాడికి రెండు గంటల ముందు ఎవరూ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారించారు. రాత్రి 12 గంటల తర్వాత ఎవరూ నివాసంలోకి వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైనట్టు చెబుతున్నారు.
సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి ముందుగానే బిల్డింగ్‌లోకి ప్రవేశించి దాడికి అనువైన సమయం కోసం వేచిచూశాడా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. లోపల దాక్కొని ఈ పన్నాగానికి పాల్పడ్డాడా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై అక్కడి విపక్షాలు మండిపడుతున్నాయి. సెలబ్రిటీలకు కూడా రక్షణ లేకపోతే, ముంబై నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటంటూ విరుచుకుపడుతున్నాయి.

Show More

Related Articles

Back to top button