యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ / 24 / తెలంగాణన్యూస్ : జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 8వ మహాసభలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య , తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యండి సజ్జనార్ హాజరైయ్యారు.
హైదరాబాద్ లోని బాగ్ లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రోజు నిర్వహించిన సభలో ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సమావేశంలో పాల్గొన్ని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆర్టీసీ ఉద్యోగులను ఆత్మీయంగా పనికి ఆలింగనం చేసుకున్న అనంతరం సన్మానించి మెమోంటోలను అందజేసారు. తర్వాత బీసీ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క పలు డిమాండ్స్ లకి సంబంధించిన వినతి పత్రాన్ని ఉద్యోగులు బీర్ల అయిలయ్యకు అందిచారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.