క్రైమ్

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

తెలంగాణ న్యూస్:కూసుమంచిఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన వడియా నవీన్ కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటు.. చుట్టుపక్కల మామిడి తోటల్లో మొక్కలు అంటుగట్టే పనికి వెళ్తుంటాడుఈ క్రమంలో అతడు కొన్ని అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరిగి.. అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక మనస్తాపానికి గురయ్యాడుపని కోసమని చెప్పి 10 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన నవీన్ కుమార్ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. గురువారం నుంచి అతడి మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టగా.. అతడి వ్యవసాయ భూమి లోనే చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కన్పించాడు

 

Show More

Related Articles

Back to top button