తాజా వార్తలు

అడుగంటి పోతున్న భూగర్భ జలాలు ఆందోళన చెందుతున్న. రైతన్నలు

కరువుకాలంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు

ఎడారిగా మారుతున్న పంట భూములుమూగజీవాలకు సైతం నీరు దొరకని పరిస్థితివృధాగా ఉన్నవాటర్ ట్యాంకులుపెట్టిన పెట్టుబడి కూడావెళ్లలేని పరిస్థితినారాయణపురం తెలంగాణ న్యూస్  ఫిబ్రవరి 13ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో రైతులు సాగు చేసుకున్న వరి పొలం పూర్తిగా ఎండిపోయి రైతుల ఆందోళన చెందుతున్నారు సాగునీరు తాగునీరు ప్రాజెక్టు వనరు లేకపోవడం ద్వారా గత రెండు సంవత్సరాలుగా చెరువులు కుంటలు నిండలేని పరిస్థితిలో వేసిన పంటకు గింటుబాటు ధర రాక అనేకమంది అప్పుల పాలై హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా మారుతున్నారు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు నారాయణపూర్ మండల కేంద్రంలోని దాదాపు వేల ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉన్నప్పటికీ సరైనటువంటి ప్రాజెక్టు లేక చెరువులు నిండక రైతులు అడ్డమీది కూలీలుగా మారుతున్నారు . మండలంలోని 31 గ్రామపంచాయతీ పరిధిలో గల అనువైన సేద్య భూములు ఉన్నప్పటికీ అనునిత్యం జీవనం రేక్కాడితే డొక్కానిందని చూడండి దీనదాయ స్థితిలో ప్రజలు జీవిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ ప్రాంతంలో ఆరు టీఎంసీల ప్రాజెక్టు నిర్మించి నీళ్ల కొండచెరువు నవాబు చెరువు. కొత్తచెరువు. గంగ మూల తండా చెరువు పల్లగట్టు తండా చెరువు ఆరుట్ల చెరువు ఇబ్రహీంపట్నం చెరువు ఈ ప్రాంత ప్రాజెక్టు నిర్మించినట్లయితే 31 గ్రామపంచాయతీ మరియు చౌటుప్పల్ మర్రిగూడెం చండూరు మునుగోడు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలు సస్యశ్యామలమయితాయి దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఆకలితో పస్తులు ఉండడం మన దేశంలో వ్యవసాయం అనేది కనుమరుగవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతుల పక్షాన నిలబడి రైతులకు అందుబాటులో ఉండి రైతు శ్రమను గుర్తించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కొంత మంది అభిప్రాయపడుతున్నారు
మండలంలోని గత ప్రభుత్వాలు నిర్మించిన కృష్ణా జలాల త్రాగునీటి ట్యాంకులు నిరుపయోగంగా ఉండడంతో రానున్న రోజులలో నీళ్ల కోసం మైళ్ళకొద్దీ నడవక తప్పదు మూగజీవా కోసం నిర్మించిన వాటర్ ట్యాంకులను నింపి ఆకలి దప్పికను తీర్చుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కొంతమంది తెలియపరుస్తున్నారు ఇప్పటికైనా ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మండల ప్రజా పరిషత్ అధికారులు రెవెన్యూ అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా త్రాగునీరు అందించే అవసరం ఉందని వేడుకుంటున్నారు

Show More

Related Articles

Back to top button