
- ‘హరిహర వీరమల్లుకు’ పవన్ చాలా సమయాన్ని కేటాయించారన్న నిధి
- సినిమా కోసం పవన్ చాలా కష్టపడ్డారని ప్రశంస
- ఈ నెల 20న వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్లలో పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సినిమా షూటింగ్ చాలా టైమ్ తీసుకుందని కొందరు అంటున్నారని… పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో ఉంటూనే సినిమాకు చాలా సమయాన్ని కేటాయించారని చెప్పింది. ఆయన ఎంతో కష్టపడ్డారని తెలిపింది.
మూవీకి అంత సీన్ లేదని, అందుకే లేట్ అవుతోందని కామెంట్స్ వచ్చాయని… ట్రైలర్ వచ్చాక వాటికి చెక్ పడిందని నిధి వ్యాఖ్యానించింది. సినిమా అద్భుతంగా ఉందనే కామెంట్లు ఇప్పుడు వస్తున్నాయని… అందుకే పుకార్లను నమ్మరాదని చెప్పింది. మరోవైపు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 20న వైజాగ్ లో నిర్వహించనున్నారు.