భీమదేవరపల్లి మండల ప్రతినిధి //మన తెలంగాణ న్యూస్భారతీయ జనతా పార్టీ భీమాదేవరపల్లి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాపాకాయలు స్వీట్లు సంబరాలు చేయడం జరిగింది. నరేందర్ రెడ్డి ఓటమి మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలని రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా సేమ్ ఇదేవిధంగా రిపీట్ అవుతుందని తెలియజేయడం జరిగింది. మల్కా కొమురయ్య. చిన్నమైల్ అంజిరెడ్డి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. మాజీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల రక్తం తాగడమే తప్ప పేద ప్రజలకు ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. విధానాలు నచ్చకనే ఉపాధ్యాయులు మేధావులు గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ విజయాన్ని అందించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ని టార్గెట్ చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతు కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఇద్దరు మంత్రులుండి ఒక్క ఎమ్మెల్సీ గెలిపించుకోలేని మంత్రులు బండి సంజయ్ ని టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉంది. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సి వస్తుందని స్థానిక సర్పంచులు ఎంపిటిసిలు జడ్పిటిసి ఎలక్షన్లు పెట్టకుండా దాటవేస్తూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక ఎలక్షన్లలో కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఉమ్మడి కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం బండి సంజయ్ కుమార్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించ లేనటువంటి దౌర్భాగ్య పాలన కాంగ్రెస్ పాలన అని ప్రజలు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, గండు సారయ్య,మాచర్ల కుమారస్వామి, ఊస కోయిల కిషన్, అంబీర్ కవిత, దొంగల వేణు, బొజ్జపురి పృధ్వీరాజ్, దొంగల రాణా ప్రతాప్, కంకల సదానందం, లక్కిరెడ్డి మల్లారెడ్డి,అయిత సాయి తేజ, బొల్లంపల్లి శ్యామ్,కాలేరు వికాస్,సింగం రాజేందర్, చొప్పరి నవీన్,గద్ద రాజేందర్, బైక్ అఖిల్, సిద్ధమల్ల రమేష్, వేముల ప్రసాద్, ఆవుల శ్రీనివాస్,మొండెడ్ల ఉదయ్, తాళ్లపల్లి రవిచంద్, జనగాని కుమారస్వామి, చార్మిత, సంజయ్ తదితరులు పాల్గొన్నారు
0 1 minute read